మన జట్టును చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది

new-zealand pm Jacinda Adern
new-zealand pm Jacinda Adern

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌ ప్రధానమంత్రి జసిండా ఆర్డెర్న్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ పై స్పందించారు. ఫైనల్‌ మ్యాచ్‌ ఎంతో అద్భుతంగా సాగింది. ఈ సూపర్ ఓవర్‌ పోరుతో మనం మరింత మెరుగయ్యాం. విజేతగా నిలిచిన ఇంగ్లాండ్‌కు అభినందలు. మన జట్టును చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది. జట్టుగా మీరు ఎంతో రాణించారు అని అన్నారు. ఆఖరి వరకు విజయం కోసం పోరాడిన కివీస్‌ ఆటగాళ్లు అందరి అభినందనలు అన్నారు.
ఆదివారం జరిగిన ఇంగ్లాండ్్లన్యూజిలాండ్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగింది. సూపర్‌ ఓవర్‌ వరకు సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ విజేతగా నిలిచింది. సూపర్‌ పోరులో కూడా స్కోరు సమానంగా మారడంతో బౌండరీలని లెక్కించి ఇంగ్లాండ్‌ను విజేతగా నిర్ణయించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/