భారత్ మాతాకీ జై అన్న న్యూజిలాండ్ ఫ్యాన్

హామిల్టన్: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 ఉత్కంఠ పోరులో టీమిండియానే పైచేయి సాధించిన విషయం తెలిసిందే. బంతి బంతికి సమీకరణాలు మారిన నేపథ్యంలో మైదానంలో ఉన్న ఆటగాళ్లతో పాటు స్టేడియంలోని ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో అంతకుమించిన ఉత్కంఠతతో మ్యాచ్‌ను తిలకించారు. అంతేకాకుండా కోహ్లి సేనకు మద్దతుగా వారిని ఉత్సాహపరుస్తూ కమాన్ ఇండియాగ అంటూ నినాదాలు చేశారు. మ్యాచ్ ముగిసిన అనంతరం టీమిండియా అభిమానులు సంబరాల్లో మునిగితేలారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర సంఘటన స్టేడియంలో చోటు చేసుకుంది.
టీమిండియాకు మద్దతుగా అభిమానులు భారత్ మాతా కీ జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే ఈ నినాదాలకు ఆకర్షితుడైన ఓ కివీస్ ఫ్యాన్ కూడా భారత బృందంలో చేరిపోయాడు. అ క్రమంలో ఆ నినాదాన్ని తొలుత నేర్చుకుని ఆతర్వాత బిగ్గరగా భారత్ మాతా కీ జై అంటూ నినదించడం ప్రారంభించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. నిమిషాల వ్యవధిలోనే లైక్‌లు, షేర్‌లతో ఆ వీడియో సోషల్ మీడియాలో హోరెత్తిపోయింది.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/