న్యూజిలాండ్‌ లో 5 నుంచి 11 ఏండ్ల చిన్నారులకు కరోనా టీకా

వెల్లింగ్టన్‌: ఒమిక్రాన్‌ ర్యాపిడ్‌ స్పీడ్‌తో విస్తరిస్తున్న నేపథ్యంలో న్యూజిలాండ్‌ ప్రభుత్వం అప్రమత్తమవుతున్నది. దేశంలో ఐదు నుంచి 11 ఏండ్ల చిన్నారులకు కరోనా టీకా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ వయస్సు వారికి ఫైజర్‌ వ్యాక్సిన్‌ను పంపిణీ చేయడానికి హెల్త్‌ రెగ్యులేటర్‌ అయిన మెడ్‌సేఫ్‌ ప్రాథమికంగా అనుమతించింది.

పీడియాట్రిక్‌ ఫైజర్‌ వ్యాక్సిన్‌ రెండు డోసులు పంపిణీ చేస్తామని వెల్లడించింది. 21 రోజుల వ్యవధిలో రెండు డోసులను ఇస్తామని చెప్పింది. ఇక మంత్రివర్గం అనుమతిస్తే చిన్నారులకు వచ్చే ఏడాది జనవరి చివరినాటికి చిన్నారులకు వ్యాక్సినేషన్‌ ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటికే స్పెయిన్‌, అమెరికా, బ్రిటన్‌, హంగరీ, గ్రీస్‌, జర్మనీ దేశాలు చిన్నారులకు కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ చేయడానికి అనుమతించిన విషయం తెలిసిందే.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/