సంతోషాన్ని, విజయాన్ని తీసుకురావాలని ఆకాంక్షిద్దాం.

New Year Celebrations

డిసెంబర్‌ 31 అర్థరాత్రి 12 గంటలు అవగానే పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో హ్యాపీ న్యూఇయర్‌ అంటూ శుభాకాంక్షలు చెప్ఞ్పకోవటం ప్రతీ సంవత్సరం జరుగుతూనే ఉంది. బాణాసంచా సందళ్లు, వాహనాలపై యువకులు కేరింతలు కొడుతూ తిరగటం, స్వీట్స్‌, చాక్లెట్స్‌ బహుమతులు ఒకరికొకరు ఇచ్చిప్ఞచ్చుకొని శుభాకాంక్షలు తెలుప్ఞకోవటం పరిపాటి. ఎంత కాదన్నా జనవరి 1 కొత్త సంవత్సరం అంగరంగ వైభవంగా అందరూ జరుప్ఞకుంటూనే ఉంటారు. వివిధ దేశాల్లో, వివిధ ప్రాంతాల్లో వారి కాలమానం ప్రకారం నూతన సంవత్సరం రాకలో తేడాలున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా జనవరి 1వ తేది అందరికీ ప్రత్యేకతను, ఆనందాన్ని ఇచ్చే రోజు.
హిందూ, బబిలోనియా, జొరాష్ట్రియా, హిబ్రూ, రోమన్‌ వంటి ప్రాచీన నాగరికత గల ప్రజలు కొన్నివేల ఏళ్ల కిందట వారివారి క్యాలెండర్లను సౌరయానం, చంద్రయానం ప్రకారం రూపొందించుకున్నారు. రోమన్‌లు ఏదైన కొత్త పని ప్రారంభించాలంటే మొదటి పూజ, తమ దేవత జోనస్‌కు చేసేవారు. ఆమె పేరు ఆధారంగా జనవరి పేరు వచ్చిందంటారు. జూలియస్‌ సీజర్‌ పాత రోమన్‌ క్యాలెండర్‌ని సమూలంగా మార్చి సౌరమానం ఆధారంగా కొత్త క్యాలెండర్‌ను ప్రవేశపెట్టారు. జనవరి 1వ తేది కొత్త సంవత్సరం ప్రారంభం అని, 365 రోజులు సంవత్సరానికి ఉంటాయని, నెలకు 30,31 రోజులు వస్తాయని, 4 సంవత్సరాలకు ఒకసారి ఒక అదనప్ఞ రోజు వస్తుందని, దాన్ని లీప్ఞ సంవత్సరంగా, ఫిబ్రవరిలో ఒక అదనప్ఞ రోజు వస్తుందని, అందరూ అదే పద్ధతి పాటించాలని ఉత్తర్వులు జారీ చేశాడు. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్నది ఈ గైగేరియన్‌ క్యాలెండర్‌నే. పోప్‌ గైగరి రూపొందించిన ఈ గైగేరియన్‌ క్యాలెండర్‌ని జూలియస్‌ సీజర్‌ మార్పులు చేసి క్రమబద్ధం చేశాడు. అలా మొదలై ఫ్రాన్స్‌, ఇటలీ, పోర్చుగీస్‌, స్పెయిన్‌, జర్మనీ, ఇంగ్లాండ్‌, జపాన్‌, చైనా, బల్గేరియా, రష్యాలలో వరుసగా నూతన సంవత్సరం జనవరి 1న జరుప్ఞకోవటం ప్రారంభించారు. 17, 18 శతాబ్దాల్లో బ్రిటిష్‌ వారు తమ ఆధీనంలో ఉన్న అన్ని దేశాలలో ఈ క్యాలెండర్‌ని అమలులోకి తీసుకురావడం జరిగింది. ఆ కాలంలో భారతదేశం కూడా వారి ఆధీనంలో ఉండటం కారణంగా వారి కొత్త సంవత్సరం మనం కూడా జరుప్ఞకోవడం మొదలైంది. గైగేరియన్‌ క్యాలెండర్‌లో ఎన్నో లోపాలు ఉన్నాయని నానాజాతి సమితి నివేదికలు ఇచ్చినా, ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాత పండితులు తప్ఞ్ప పట్టినా క్రైస్తవ సమాజం దీనిని పక్కన పెట్టేసింది. ప్రపంచీకరణ నేపథ్యంలో అన్నీ దేశాల వారు ఆంగ్ల సంవత్సరాదిని జనవరి 1 నుంచే ప్రారంభించడం మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా నూతన సంవత్సరం ఒకే నెలలో, ఒకే తేదీన వస్తే బాగుంటుందని భావించి రూపొందించినా మన భారత దేశంలో నూతన సంవత్సరాన్ని చైత్ర మాసంలో జరుప్ఞకోవటం ఆనవాయితిగా వస్తోంది. భారతీయ క్యాలెండర్‌ ఋషులచే తయారు చేయబడింది. ఆర్యభట్ట, భాస్కరాచార్య వంటి మహా శాస్త్రజ్ఞులచే పరిశోధించబడింది. కొన్ని సంవత్సరాల తరువాత ఏ సంవత్సరంలో, ఏ నెలలో, ఏ రోజున, ఏ గ్రహణం వస్తుందో, వారం, వర్జంతో సహా చెప్పగలిగేలా శోధించబడింది. ప్రకృతికి అనుగుణంగా వసంత ఋతువ్ఞ, చైత్ర, శుక్ల, పాడ్యమి ఉగాదిగా, కొన్ని ప్రాంతాల్లో వసంత బుుతువ్ఞ మేష రాశిలో సూర్యుడు ప్రకాశించే రోజు ఉగాదిగా జరుప్ఞకుంటున్నారు.

ఈ విధంగా మన దేశంలో ప్రాంతాల వారిగా 8 విధాలుగా నూతన సంవత్సర వేడుకల్ని ఘనంగా జరుప్ఞకుంటున్నాం. మన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోని వారు చైత్ర మాసంలో వచ్చే శుక్ల పాడ్యమిని నూతన తెలుగు సంవత్సరం ఉగాదిగా, తమిళనాడు వారు ఏప్రిల్‌ మధ్యలో ప్ఞత్తండును, కేరళ వారు మే నెలలో వచ్చే మొదటి రోజును విషుగా, గుజరాత్‌ వారు దీపావళి మరుసటి రోజు బెస్తువారాస్‌గా, పంజాబ్‌ వారు వైశా ఖి అనే పండుగను, మహారాష్ట్ర వారు గుడిపడువాగా, అస్సాం వారు రొంగాలి బిహుగా, బెంగాల్‌ వారు పహేల్‌ బైసాబ్‌ను ఇలా వివిధ ప్రాంతాల్లో, వివిధ నెలల్లో వారి సంప్రదాయాల ప్రకారం నూతన సంవత్సరాన్ని జరుప్ఞకుంటారు. ఇన్ని భిన్న సంప్రదాయాలు ఉన్నప్పటికీ నూతన సంవత్సరం వేడుకలు కాలగమనం ఆధారంగా సమయాలలో కొద్దిపాటి మార్పులతో వైభవంగా జరుగుతూనే ఉన్నాయి. ఇవి ఫసిఫిక్‌ ఐలాండ్‌ టోంగాతో ప్రారంభమయి న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, జపాన్‌, సౌత్‌ కొరియా, చైనా, ఫిలెప్పైన్స్‌, ఇండోనేషియా, మయన్మార్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, ఇండియా, శ్రీలంక, పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌, అజబైజాన్‌, ఇరాన్‌, మాస్కో, రష్యా, గ్రీస్‌, జర్మనీ,

యునైటెడ్‌ కింగ్‌డం, బ్రెజిల్‌, అర్జెంటీన, పరాగ్వే, కెనడ, అలాస్కా, ఇలా వరుసగా వెళ్లి చివరగా నూతన సంవత్సరం ప్రారంభం యునైటెడ్‌ స్టేట్స్‌లోని చిన్న ద్వీపాలలో ముగుస్తుంది. బాణాసంచాలతో, రంగురంగుల విద్యుద్దీపాల వెలుగులు, కేరింతలు, ఆనంద నృత్యాల నడుమ అందరూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఒకప్ఞ్పడు గ్రీటింగ్‌ కార్డులు ఇచ్చిప్ఞచ్చుకోడం విరివిగా ఉన్నా ప్రస్తుతం సెల్‌ ఫోన్‌లలో మెసేజ్‌లు పంప్ఞకోవడం ఎక్కువైపోయింది. ఈ నూతన సంవత్సరం విషయంలో భిన్నాభిప్రాయాలున్నా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ దేశాల్లో జనవరి 1ని నూతన సంవత్సరంగా జరుప్ఞకోవటం, మన అందరం ఈ ఆనందాన్ని పంచుకుంటూ జరుప్ఞకోవటం తప్ఞ్ప కాదనిపిస్తుంది. ఎవరి సంసృతి సంప్రదాయాలు వారివైనా క్రొత్తదనాన్ని, ఆశలను, ఆకాంక్షలను తనతో పాటు తీసుకువచ్చే నూతన సంవత్సరం జనవరి 1 సంబరాలు జరుగుతూనే ఉన్నాయి. బిన్నత్వంలో ఏకత్వం కలిగిన మన భారత దేశంలో అన్ని సంస్కృతి సంప్రదాయాలు విలువనిస్తున్నాం. ఈ నూతన సంవత్సరం మనందరి జీవితాల్లో సౌఖ్యాన్ని, సంతోషాన్ని, విజయాన్ని తీసుకురావాలని ఆకాంక్షిద్దాం.

– మల్లాది రామలక్ష్మి

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/