మెడికల్‌ కోడింగ్‌లో సరికొత్త మార్గాలు

మెడికల్‌ కోడింగ్‌ నిపుణులకు డిమాండ్‌

ఔత్సాహికులకు ప్రత్యేక సర్టిఫికేషన్‌ కోర్సులు

హెల్త్‌కేర్‌ రంగంలోని ఓ విభాగమే మెడికల్‌ కోడింగ్‌. హెల్త్‌కేర్‌ డయాగ్నసిస్‌, మెడికల్‌ సర్వీసెస్‌, మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ తదితరాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రామాణిక వర్గీకరణ వ్యవస్థ (ఉదా:ఐసిడి-10) ఆధారంగా ప్రత్యేక కోడ్‌ల రూపంలో పొందుపర్చడాన్ని మెడికల్‌ కోడింగ్‌గా పేర్కొంటారు.

Medical Coding

ఇది ప్రస్తుతం ఆరోగ్యబీమా, వైద్యఖర్చుల తిరిగి చెల్లింపుల ప్రక్రియలో కీలకంగా మారుతోంది. కారణం డాక్టర్ల నోట్స్‌, రోగులకు అందించిన సేవలు తదితరాలకు సంబంధించిన మెడికల్‌ కోడ్స్‌ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్స్‌కు అవసరమవుతాయి. వీటి ఆధారంగానే ఇన్సూరెన్స్‌ కంపెనీలు చెల్లింపులపై నిర్ణయం తీసుకుంటాయి.

పెరిగిన డిమాండ్‌:

ప్రస్తుతం హెల్త్‌కేర్‌ ఔట్‌సోర్కింగ్‌ ఇండస్ట్రీ కార్యకలాపాలు విస్తరిస్తుండటంతో మెడికల్‌ కోడింగ్‌ నిపుణులకు డిమాండ్‌ పెరుగుతోంది. పలు విదేశీ హెల్త్‌కేర్‌ సంస్థలు భరత సంస్థలతో ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో సేవలు పొందేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. దీంతో భారత్‌లో ఇటీవల కాలంలో హెల్త్‌కేర్‌ ఔట్‌ సోర్సింగ్‌, మెడికల్‌ కోడింగ్‌ విభాగాలు అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అసోచామ్‌, ఎర్నస్ట్‌ అండ్‌ యంగ్‌ తదితర సంస్థల నివేదికల ప్రకారం హెల్త్‌కేర్‌ ఔట్‌సోర్సింగ్‌ కార్యకలాపాల్లో భారత్‌ ప్రపంచంలోనే రెండోస్థానంలో ఉంది.

ప్రస్తుతం దేశంలో మెడికల్‌ కోడింగ్‌లో మానవ వనరుల డిమాండ్‌ సప్ల§్‌ు కోణంలో 40శాతం వ్యత్యాసం ఉంది. ఇదే ధోరణి రానున్న రోజుల్లోనూ కొనసాగనుందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయంగా చాలా దేశాలు భారత్‌ను హెల్త్‌కెర్‌ ఔట్‌సోర్సింగ్‌కు గమ్యంగా ఎంచుకోవడమే దీనికి కారణమన్నది జాబ్‌ మార్కెట్‌ నిపుణుల మాట.

సర్టిఫికేషన్స్‌:

మెడికల్‌ కోడింగ్‌ ఔత్సాహికులకు ప్రత్యేక సర్టిఫికేషన్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అమెరికన్‌ హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (ఏహెచ్‌ఐఎంఎ) బోర్డ్‌ ఆఫ్‌ మెడికల్‌ స్పెషాలిటీ కోడింగ్‌ అండ్‌ కంప్లయన్స్‌, అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ ప్రొఫెషనల్‌ కోడర్స్‌ (ఎఎపిసి), అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ కోడర్స్‌ ఇండియా (ఎఎంసిఐ) తదితర సంస్థలు సర్టిఫకేషన్‌ కోర్సులు అందిస్తున్నాయి.

వీటిని పూర్తిచేసిన వారికి హెల్త్‌ ఇన్సూరెన్స్‌ సంస్థలు, కార్పొరేట్‌ ఆసుపత్రులు రెడ్‌కార్పెట్‌ స్వాగతం పలుకుతున్నాయి. కోర్సుల వ్యవధి మూడు నుంచి ఆర్నెళ్లుగా ఉంటోంది.

హోదాలు:

మెడికల్‌ కోడర్స్‌కు లభించే హోదాలను పరిగణనలోకి తీసుకుంటే సర్టిఫైడ్‌ మెడికల్‌ కోడర్‌ హోదా ప్రధానంగా నిలుస్తోంది. ఆరోగ్య సంరక్షణ సేవల రంగంలో టెక్నికల్‌ కోడ్స్‌ రాయడం, డీ-కోడింగ్‌ తదితరాలు వీరి ప్రధాన విధులుగాఉంటాయి.సర్టిఫైడ్‌ మెడికల్‌ కోడర్లు సునిశీత పరిశీలనతో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

కోడింగ్‌ స్పెషలిస్టు:

మెడికల్‌ కోడింగ్‌ విభాగంలోని మరో ప్రధాన హోదా కోడింగ్‌ స్పెషలిస్టు అక్షరాలు, న్యూమ రికల్స్‌ తదితరాల కలయికగా ఉండే కోడ్‌లను రూపొందించడం ఈ హోదాలో ప్రధాన విధులుగా ఉంటాయి.
ఇతర హోదాలు: మెడికల్‌ కోడింగ్‌కు సంబంధించి కోడర్‌, బిల్లర్‌, కోడింగ్‌ స్పెషలిస్టు వంటి హోదాలతోపాటు ఇతర అనేక జాబ్‌ ప్రొఫైల్స్‌, అందుబాటులో ఉన్నాయి. అవి రీయింబర్స్‌మెంట్‌ స్పెషలిస్టు, క్లెయిమ్‌ ప్రొఫెసర్‌/ క్లెయిమ్‌ రివ్యూయర్‌, పేషెంట్‌ రిప్రజెంటేటివ్‌, మెడికల్‌ కలెక్టర్‌, ఎలక్ట్రానిక్‌ క్లెయిమ్‌ ప్రొఫెసర్‌

Medical Coding

ఆకర్షణీయ వేతనాలు:

ప్రస్తుత డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటే మెడికల్‌ కోడర్లకు ప్రారంభంలోనే ఆకర్షణీయ వేతనాలు లభిస్తున్నాయి. ఎంట్రీ లెవల్‌లో కోడర్‌/ బిల్లర్‌కు నెలకు రూ.30 వేల నుంచి రూ.35 వేల వేతనం లభిస్తోంది. మూడేళల పని అనుభవంతో టీమ్‌ లీడర్‌గా రూ.45 వేలు, రూ.50వేలు, ఆ తర్వాత మేనేజర్‌/ సీనియర్‌ మేనేజర్‌ స్థాయిలో రూ.60 వేలకు పైగా వేతనం పొందొచ్చు.సర్టిఫైడ్‌ మెడికల్‌ కోడర్లకు ఫ్రీలాన్స్‌ అవకాశాలు విస్తృతమయ్యాయి.

ప్రధానంగా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ విభాగంలోని థర్డ్‌పార్టీ ఏజెన్సీలు, యూఎస్‌కు చెందిన ప్రముఖ హెల్త్‌కేర్‌ సంస్థలు ఫ్రీలాన్స్‌ అవకాశాలు అందిస్తున్నాయి. ప్రస్తుతం చాలా ఆసుపత్రులు ఫ్రీలాన్స్‌ సేవలపై ఆధారపడుతున్నాయి.

ఈ విధానంలో ఆన్‌లైన్‌ ఆధారంగా పనిచేసే వారు నెలకు కనీసం రూ.30వేలు సంపాదించే అవకాశం ఉంది. మెడికల్‌ కోడింగ్‌ విభాగంలో అనలిస్టులకూ అవకాశాలు లభిస్తున్నాయి. వైద్యులు, రేడియాలజిస్టులు అందించే రిపోర్టులు/ సేవలు, రోగుల రికార్డులను సునిశీతంగా విశ్లేషించే కోడింగ్‌ చేసే క్రమంలో అనలిస్టుల అవసరంఏర్పడుతోంది.

ఈ నేపధ్యంలో మెడికల్‌ కోడింగ్‌ విభాగంలో సేవలందిస్తున్న ఔట్‌సోర్సింగ్‌ సంస్థలు అనలిస్టు హోదాలో టెక్నికల్‌ నైపుణ్యాలున్న అభ్యర్థులను నియమించుకుంటున్నాయి.

మెడికల్‌ కోడింగ్‌ కెరీర్‌ అవకాశాలు కేవలం లైఫ్‌ సెస్సైస్‌ విద్యార్థులకే పరిమితం అనుకుంటే పొరపాటే. ఇతర కోర్సులు చదివిన విద్యార్థులు సైతం మెడికల్‌ కోడింగ్‌ విభాగంలో కొలువులను సొంతం చేసుకోవచ్చు.

మెడికల్‌ టెక్మినాలజీ, హెల్త్‌కేర్‌ రంగంపై ప్రాథమిక పరిజ్ఞానం ఉండి.వివిధ సంస్థలు అందిస్తున్న సర్టిఫికేషన్స్‌ పూర్తి చేయడం ద్వారా ఔత్సాహికులు మెడికలు మెడికల్‌ కోడింగ్‌ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.

https://www.ahima.org

https://medicalspecialtycodingcom

https://www.aapc.com

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/