అక్టోబర్‌ నుంచి కొత్త సంస్కరణలు

జనరంజక పాలనతో చరిత్రసృష్టిస్తాం: మంత్రి బుగ్గన
వినతులు ఇచ్చేందుకు వెల్లువలా జనం

AP MINISER BUGGANA
AP MINISER BUGGANA

డోన్‌: వైఎస్సార్సీ ప్రభుత్వ పాలనలో కొత్తగా సంస్కరణలు తీసుకవచ్చి ప్రజలకు ప్రభుత్వం నమ్మకం కల్గించడమే ద్యేయంగా పనిచేస్తుందని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళికా శాఖామంత్రి బుగ్గన అన్నారు. సచివాలయ ఉద్యోగులతో ఇక ప్రభుత్వ కార్యాలయాలచుట్టూ ప్రజలు చెప్పులరిగేలా తిరిగే సంస్కృతికి ఇక ఫుల్‌స్టాప్‌ పెట్టినట్లేనని చెప్పారు. కొత్తగా వస్తున్న సచివాలయ ఉద్యోగుల పాలన ఈ ప్రభుత్వంలో జనం కోసం తీసుకొస్తున్న అతిపెద్ద సంస్కరణయని దీంతో పాలనలో ఓ కొత్త చరిత్రను ఈ ప్రభుత్వం సృష్టించబోతోందని వెల్లడించారు. కాగా బుగ్గనకు సమస్యలను విన్నవించేందుకు డోన్‌, ప్యాపిలి మండలాలనుంచి పార్టీ కార్యాకర్తలు, నాయకులతో పాటు సామాన్యప్రజలు ఒక వెల్లువలా తరలిరావడంతో జిల్లా పరిషత్‌ అథితి గృహంలో తొక్కిసలాట జరిగింది. ఆదివారం డోన్‌వచ్చిన బుగ్గన జడ్పీగెస్ట్‌హౌస్‌లో అధికారులతోనూ, సామాన్య ప్రజలతోనూ కలిసారు. వారి సమస్యలను వినతులరూపంలో స్వీకరించారు. అనంతరం వైఎస్సార్సీనాయకులు మర్రి గోవిందరాజ్‌ స్వగృహంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మర్రి గోవిందరాజ్‌ స్వగృహంలో పాత్రికేయులతో బుగ్గన మాట్లాడారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/