వాట్సాప్‌లో మరో అప్‌డేట్‌

whatsapp
whatsapp

న్యూఢిల్లీ: వాట్సాప్‌ వచ్చాక స్మార్ట్‌ఫోన్ల వినియోగదార్లకు మరింత సౌకర్యం పెరిగింది. ఇప్పుడు త్వరలోనే తన యూజర్లకు మరో అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. వాట్సాప్‌లో మనం పంపించే మెసెజ్‌లో వాటంతట అవే డిలీట్‌ అయ్యేలా ఒక కొత్త ఆప్షన్‌ను పరిశీలిస్తోంది. ఇప్పటికే మనం పంపిన మెసేజ్‌ను ఒక నిర్ణీత సమయంలోపు డిలీట్‌ చేసుకునే సౌలభ్యం అందిస్తున్న విషయం విధితమే. అయితే ఇకపై ఈ మెసేజ్‌లు 5 సెకన్ల నుంచి 1 గంట వరకు మాత్రమే కనిపించి ఆ తర్వాత వాటంతట అవే ఆటోమేటిగ్గా అదృశ్యమైపోయేలా చేయవచ్చు. అందుకుగాను వాట్సాప్‌ సెట్టింగ్స్‌ విభాగంలో అందజేసే డిజప్పియరింగ్‌ మెసేజెస్‌ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. వా బేటా అందించిన సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ ఫీచర్‌ను పరీక్షిస్తోంది. అంటేఅఏదైనా సెన్సిటివ్‌ మెజేస్‌ను పంపించాక, అది ఎక్కువ సేపు ఉండకూడదని భావిస్తే డిజప్పియర్డ్‌ మెసేజెస్‌లోకి వెళ్లి, ఆఫ్‌, 5 సెకండ్స్‌, గంట అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఇది గ్రూపు చాటింగ్‌లోగానీ, వ్యక్తిగత చాటింగ్‌లోగానీ ఈ ఆప్షన్‌ను వినియోగించుకోవచ్చు.
తాజా జాతీయ వార్త కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/