నేడు కేంద్రమంత్రివర్గం సమావేశం

New Union Cabinet
New Union Cabinet

న్యూఢిల్లీ: భారతదేశ 16వ ప్రధానిగా నరేంద్రమోడి నిన్న సాయంత్రం ప్రమాస్వీకారం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు కేంద్ర కేబినెట్‌ సమావేశం కానుంది. అయితే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొదటిసారి కేంద్ర మంత్రివర్గం సమావేశం అవుతుంది. 17వ లోక్‌సభలో 24 మంది కేబినెట్ మంత్రులుగా, 9 మంది స్వతంత్ర హోదా మంత్రులుగా, 24 మంది సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, రవిశంకర్ ప్రసాద్, సదానందగౌడతో పాటు పలువురు ఎంపీలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం కిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/