కొత్త రకం వైరస్: పిల్లలపై ప్రభావం అధికం!
బ్రిటన్ నిపుణుల అభిప్రాయం

London: బ్రిటన్ ను వణికిస్తున్నకొత్త రకం కరోనా మహమ్మారి పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందా?అవుననే అంటున్నారు నిపుణులు.
ఈ కొత్త రకం కరోనా వైరస్ పిల్లలలో వేగంగా వ్యాప్తి చెందుతుందని, వారిలో రోగనిరోధక శక్తిని క్షీణింపచేస్తుందని బ్రిటన్ కు చెందిన నెర్వ్ టాగ్ ప్రభుత్వ సంస్థ న్యూ అండ్ ఎమర్జింగ్ రెస్పిరేటరీ వైరస్ థ్రెట్స్ అడ్వైజరీ గ్రూప్ నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఇది దక్షిణ బ్రిటన్ కే పరిమితం అయినట్లు కనిపిస్తున్నా, త్వరలో బ్రిటన్ మొత్తం వ్యాపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
తాజా ‘చెలి’ శీర్షికల కోసం : https://www.vaartha.com/specials/career/