మోడల్‌ అత్యాచార కేసులో కొత్త కోణం

ఆ అమ్మాయి రూ. 20 లక్షలు డిమాండ్‌ చేసింది: నిందితుడి తల్లి

Model gang rape case
Model gang rape case

హైదరాబాద్‌: నగరంలోని జూబ్లీహిల్స్‌లో గ్యాంగ్‌ రేప్‌కు గురైన మోడల్‌ కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. మోడలింగ్‌ చేస్తున్న ఓ యువతిని సమూహికంగా అత్యాచారం చేసి.. వీడియో తీసిన ఇద్దర యువకుల్ని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నిందితుల్లో ఒకరు మైనర్ అన్న సంగతి కూడా తెరపైకి వచ్చింది. అయితే నిందితుల్లో ఓ యువకుడి తల్లి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తన కుమారుడుకు ఏం పాపం తెలియదంది. అమ్మాయే తన కొడుకును ట్రాప్ చేసిందని రూ. 20 లక్షలు ఇస్తే.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయనని తన లాయర్‌తో కబురు పంపిందని తెలిపింది. లాయర్ నెంబర్ కూడా తమకు ఇచ్చిందని తెలిపింది. యువతి లాయర్ ఇచ్చిన విజిటింగ్ కార్డును కూడా నిందితుడి తల్లి మీడియాకు చూపించింది. తాను ఓ లేడీ హాస్టల్ నడుపుతున్నానని తన హాస్టల్‌లోనే బాధిత యువతి రెండు నెలల పాటు ఉండేదని చెప్పింది. ఆ సమయంలోనే తన కుమారుడితో ఆమెకు పరిచయం ఏర్పడిందని తెలిపింది. అయితో ఓ సారి తాగి వచ్చిన బాధిత యువతి హాస్టల్‌లో నానా హంగామా చేయడంతో హాస్టల్‌ ఖాలీ చేయించేశామని పేర్కొంది. తన కుమారుడ్ని అనవసరంగా ఈ కేసులో ఇరికిస్తున్నారని తెలిపింది. మరోవైపు బాధితురాలు మాత్రం తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంది. పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తోంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/