వాహన దారులకు షాకింగ్ న్యూస్ ..

వాహనదారులకు షాకింగ్ న్యూస్..ఇప్పటి వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి మాత్రమే పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించే వారు కానీ ఇక నుండి ట్రాఫిక్ రూల్స్ పాటించని వారికీ సైతం కౌన్సిలింగ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.మొత్తం 10 చలాన్లు పెండింగ్ లో ఉన్న వాహనదారులను పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటీకే హైదరాబాద్ నగరం దీనిని అమలు చేస్తున్నారు. 10చలాన్ల కంటే ఎక్కువ ఉంటే వారిని స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు.

ఈ కౌన్సిలింగ్ లో ఎలాంటి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడ్డారు. వాటి వల్ల ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయి. అని పోలీసులు వాహన దారులకు వివరిస్తారు. ఇదిలా ఉంటే ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే పోలీసులు కేసులు నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ కొందరిలో మార్పు రావడం లేదు. ఒకసారి చలాన్ కట్టినా మళ్లీ పది సార్లు అలాంటి తప్పులే చేస్తున్నారు. అందుకే ట్రాఫిక్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.