కొత్త సుజుకీ బైక్‌ జిక్సర్‌ 250

Suzuki Gixxer SF 250
Suzuki Gixxer SF 250

న్యూఢిల్లీ: సుజుకీ మోటార్‌సైకిల్‌ ఇండియా శుక్రవారం నాడు దేశీయ మార్కెట్లోకి జిక్సర్‌ 250 బైక్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.1,59,800 (ఎక్స్‌షోరూమ్‌, ఢిల్లీ). ఈ బైక్‌లో ఫోర్‌ స్ర్టోక్‌ 249 సీసీ ఇంజన్‌, డ్యూయల్‌ చానల్‌ యాంటీ లాక్‌ బ్రేక్‌ సిస్టమ్‌(ఏబీఎ్‌స)తో కూడిన సిక్స్‌ స్పీడ్‌ గేర్‌ బాక్స్‌ వంటి ఫీచర్లు ఈ బైక్‌లో ఉన్నాయి. ఈ బైక్‌లో అత్యాధునిక టెక్నాలజీని వినియోగించామని, ఫలితంగా దీని పనితీరు చాలా మెరుగ్గా ఉంటుందని కంపెనీ హెడ్‌ కోయిచిరో హిరావో తెలిపారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/