విప్రో చైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీకి పదవీ గండం?

ఈ ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీ తర్వాత ఎగ్జిక్యూటివ్‌ రోల్‌ను కోల్పోయే ప్రమాదం

Rishad Premji
Rishad Premji

బెంగళూరు: విప్రో చైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీకి పదవీ గండం పొంచి ఉందట మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబి కొత్త మార్గదర్శకాల నేపథ్యంలో రిషద్‌ ఈ ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీ తర్వాత ఎగ్జిక్యూటివ్‌ రోల్‌ను కోల్పోయే ప్రమాదం ఉంది. అజీమ్‌ ప్రేమ్‌జీ గత ఏడాది తప్పుకోవడంతో ఆయన తనయుడు ఈ బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు పదవిని కోల్పోయే అవకాశముంది. సెబీ నిబంధనల ప్రకారం టాప్‌ 500 లిస్టెడ్‌ కంపెనీల చెర్మన్‌, సీఈవోలు వేర్వేరు వ్యక్తులు ఉండాలనే నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది. విప్రో మాత్రం రిషద్‌నే కొనసాగించాలని సెబిని కోరింది. సెబి కొత్త నియమాల ప్రకారం నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌నే బోర్డు చైర్‌పర్సన్‌గా నియమించాలి. రిషద్‌ను కొనసాగించేందుకు అవకాశమివ్వాలని సెబిని విప్రో కోరినప్పటికి మార్కెట్‌ నియంత్రణ సంస్థ నిరాకరించింది. రిషద్‌ చైర్మన్‌ ఉండటంతో ఎగ్జిక్యూటివ్‌ రోల్‌ పాత్ర పోషిస్తే అది సెబి నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉంటుందని విప్రోకు సమాచారం కూడా అందించిందని తెలుస్తోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/