కొత్త చెప్పులు.. ఇబ్బందులు..
కొత్త చెప్పులు మొదట ఇబ్బందిగా అనిపిస్తాయి.

కొత్తగా కొనుక్కున్న చెప్పులు మొదట రెండు మూడు రోజులు ఇబ్బందిగా అనిపిస్తాయి. ఇష్టపడి కనుక్కుని వేసుకోకపోతే ఎలా అనిపించినా వేసుకుంటే అవి కరిచినట్లు అనిపించేసిరికి పక్కన పెట్టేస్తాం.
అందుకు మరి అవి కరవకుండా ఉండడానికి కొత్త షూ ముందరి భాగం ఇరుకుగా ఉండి, కాలి బొటనవేలిని నొక్కేస్తూ ఉంటుంది.
ఇలాంటి షూ వేసుకుని ఎక్కువ దూరం నడవలేం! ఈ సమస్య తొలగాలంటే గాలి చొరబడని ప్లాస్టిక్ బ్యాగులో కొద్దిగా నీరు నింపి, షూ ముందరి భాగంలో కుక్కేసి, ఫ్రీజర్‌లో రాత్రంగా ఉంచేయాలి.
గడ్డకట్టిన నీరు వ్యాకోచిస్తుంది. దాంతో మంచు ముక్కగా మారిన చోట, షూ కూడా వ్యాకోచం చెందుతుంది. ఇలా చేస్తే సమస్య తీరినట్టే. కొత్త షూ లేదా చెప్పులు ఎక్కువసేపు ధరిస్తే మడమ దగ్గర తోలు లేచి చర్మం చిరచిరలాడుతుంది.

ఇలా జరగకుండా ఉండలంటే జెల్ డియోడరెంట్‌ను షూ లేదా చెప్పు లోపలి భాగంలో రాయాలి. కొత్త చెప్పులు కిర్రు కిర్రు మంటూ దూరం నుంచే మీ రాకను చెప్పేస్తూ ఉంటాయి.
ఈ ఇబ్బంది తప్పాలంటే షూలోని సోల్ అడుగున్న బేబీ పౌడర్ చల్లాలి. దాంతో సోలకు, షూకు మధ్యన కుషన్ ఏర్పడి శబ్దం చేయకుండా ఉంటాయి.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/movies/