పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో కొత్త రూల్స్‌!

ఫిబ్రవరి 1 నుంచి అమలు

Punjab National Bank
Punjab National Bank

ముంబై: దేశీయ రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. ఎటిఎం మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో బ్యాంకు కస్టమర్లకు ఊరట కలిగించే నిర్ణయాన్ని వెల్లడించింది. ఫిబ్రవరి 1 నుంచి కొత్త రూల్స్‌ను తీసుకువస్తున్నట్లు ప్రకటించింది.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో అకౌంట్‌ కలిగిన వారు నాన్‌ ఇఎంవి ఎటిఎం మెషీన్లలో నుంచి డబ్బులు తీసుకోవడం వీలు కాదు.

పిఎన్‌బి ట్విట్టర్‌ వేదికగా ఈ విష యాన్ని వెల్లడించింది. నాన్‌ ఇఎంవి ఎటిఎం మెషీన్ల ద్వారా ఫైనాన్షియల్‌, నాన్‌ ఫైనాన్షియల్‌ ట్రాన్సాక్షన్లు నిలిపి వేస్తున్నట్లు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ట్వీట్‌చేసింది. ఎటిఎం మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు తెలి పింది.

దీని వల్ల కస్టమర్ల డబ్బు సురక్షితంగా ఉంటుందని పేర్కొంది. ఫిబ్రవరి1 నుంచి పిఎన్‌బి కస్టమర్లు నాన్‌ ఇఎంవి ఎటిఎం మెషీన్ల నుంచి డబ్బులు తీసుకోలేరు. మీరు ఎటిఎం సెంటర్‌కు వెళ్లి మీ కార్డును ఎటిఎం మెషీన్‌లో పెడితే, మీ కార్డు ఎటిఎంలో లేకుండా వెంటనే వెనక్కి తీసుకోగలిగితే ఆ ఎటిఎంలను నాన్‌ ఇఎంవి ఎటిఎంలు అని అంటారు.

అంటే ఎటిఎం మెషీన్‌ మ్యాగ్నటిక్‌ స్ట్రిప్‌ ద్వారా మీ డేటాను తీసు కుంటుంది. ఇలా కాకుండా మీ కార్డు ఎటిఎం మెషీన్‌లోనే కొంతసేపు ఉంటే అది ఇఎంవి ఎటిఎం. ఇందులో ఎటిఎం మెషీన్‌ కార్డుపై ఉన్న చిప్‌ నుంచి డేటాను తీసుకుంటుంది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/