ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కొత్త నిబంధనలు

లాక్‌డౌన్‌ అనంతరం..కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే ..ఈ నిబంధనలు పాటించాల్సిందే..ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ప్రకటన

delhi airport
delhi airport

న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో విమానలు రద్దు అయిన సంగతి తెలిసిందే. అయితే లాక్‌డౌన్‌ ఎత్తేసే అనంతరం తీసుకోవాల్సిన చర్యలపై పలు విమాన సంస్థలు దృష్టిపెడుతున్నాయి. ఈక్రమంలోనే విమాన ప్రయాణాలు చేసేవారితో పాటు, విమాన సిబ్బంది తప్పకుండా మాస్కులు వాడాల్సిందేనని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు పేర్కొన్నారు. విమానంలో అందించే భోజనాన్ని రద్దు చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. కేవలం నీళ్లు మాత్రమే అందించనున్నారు. టాయిలెట్లను సైతం పరిమిత సంఖ్యలో వాడనున్నట్లు చెప్పారు. లాక్‌డౌన్‌ ముగిసి, విమాన సేవలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఈ కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొస్తారు.ఈ మేరకు ఇప్పటికే కేంద్ర విమానయాన శాఖకు ఢిల్లీ విమానాశ్రయ అధికారులు లేఖ ద్వారా ఈ విషయాలను తెలిపినట్లు సమాచారం.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/