నేటి నుంచి కొత్త రేషన్‌కార్డుల పంపిణీ

రాష్ట్రవ్యాప్తంగా 3.09 లక్షల కొత్తకార్డులు జారీ

హైదరాబాద్ : నేటి నుండి రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్‌కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానున్నది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ రేషన్‌కార్డుల పంపిణీని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆయాజిల్లాల్లో సంబంధిత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. రాష్ట్రంలో కొంతకాలంగా రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ ఆగిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులకు కొత్త రేషన్‌కార్డులు జారీచేస్తామని ఇటీవల సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఈ మేరకు అధికారులు దరఖాస్తులను ఆహ్వానించారు. వాటిని పరిశీలించిన పౌరసరఫరాలశాఖ అర్హులైన 3,09,083 మందికి కొత్త కార్డులను జారీచేసింది. వీటిద్వారా 8,65,430 మంది లబ్ధిపొందనున్నా రు. కొత్తకార్డులు పొందినవారికి ఆగస్టు నెల నుంచి రేషన్‌ బియ్యం పం పిణీ చేస్తారు.

కొత్తగా జారీచేస్తున్న రేషన్‌కార్డులు హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లోనే అధికంగా ఉన్నాయి. కొత్త కార్డు ల జారీతో రాష్ట్రంలో రేషన్‌కార్డుల సంఖ్యతోపాటు, లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరుగనున్నది. ఇప్పటివరకు రాష్ట్రంలో 87.41 లక్షల కార్డులు ఉం డగా 2.79 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. కొత్తకార్డుల జారీతో కార్డుల సంఖ్య 90.50 లక్షలకు చేరనున్నది. అదేవిధంగా లబ్ధిదారుల సంఖ్య 2.88 కోట్లకు చేరుకుంటున్నది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/