కొత్త రేషన్ కార్డుల పంపిణి: మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి : మంత్రి నిరంజన్ రెడ్డి సోమవారం జిల్లా కేంద్రంలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేస్తామని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్న ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు. జిల్లాలో 3,302 మందికి తెల్లరేషన్ కార్డులు ఇచ్చామని తెలిపారు. అందరికి కడుపునిండా తిండి పెట్టాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. డబుల్ బెడ్‌ రూం ఇండ్లు ,పింఛన్లు, రైతుబంధు, దళిత బంధు ఇలా చెప్పుకుంటూ పోతే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజల మీద ఉన్న మమకారం అర్థమవుతుందన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/