నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు కొత్త అవకాశాలు, హక్కులు

ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం

President Ramnath Kovind--
President Ramnath Kovind–

New Delhi: రైతు సంక్షేమానికి కేంద్రం కొత్త సాగుచట్టాలను తీసుకువచ్చిందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్శంగా ఆయన ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. 

కొత్త‌ సాగు చట్టాలతో రైతులకు కొత్త అవకాశాలు, హక్కులు లభిస్తాయని తెలిపారు. విస్తృత చర్చల తరువాతనే కొత్త సాగు చట్టాలు పార్లమెంటు ఆమోదం పొందాయని రాష్ట్రపతి పేర్కొన్నారు. గత ఏడాది కరోనా మహమ్మారితో పాటుగా తుపాన్లు, బర్డ్ ఫ్లూ వంటి పలు విపత్తులను, సవాళ్లను దేశం ఎదుర్కొందన్న రాష్ట్రపతి దేశం సమష్టిగా ఆ సవాళ్లను విపత్తులను ఎదుర్కొందని చెప్పారు.

  ప్రణబ్ ముఖర్జీ వంటి పలువురు నేతలు కరోనా కాటుకు బలయ్యారన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గణనీయంగా పెరిగాయన్న రాష్ట్రపతి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం వశేష ప్రాధాన్య ఇస్తున్నదన్నారు.  

కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా రైతుల ఖాతాల్లోకి న‌గదును బదిలీ చేస్తున్న‌ట్లు గుర్తు చేశారు. వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధికి రూ.లక్ష కోట్లతో ప్రత్యేక నిధి ప్రారంభించిన‌ట్లు తెలిపారు

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/