వైఎస్‌ఆర్‌సిపికి పార్లమెంటులో నూతన కార్యాలయం

గ్రౌండ్ ఫ్లోర్ లోని 5వ నెంబర్ గది కేటాయించిన స్పీకర్

Parliament of India
Parliament of India

న్యూఢిల్లీ: వైఎస్‌ఆర్‌సిపి పార్లమెంటులో కొత్త కార్యాలయంలోకి అడుగుపెట్టనున్నారు. వైఎస్‌ఆర్‌సిపికి పార్లమెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లోని 5వ నెంబర్ గదిని కేటాయించారు. ఈ గదిలో గత ముప్సై ఏళ్లుగా టీడీపీ కార్యాలయం కొనసాగుతోంది. గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి నుంచి 22 మంది ఎంపీలుగా ఎన్నికయిన నేపథ్యంలో తమకు పార్లమెంట్ లో గదిని కేటాయించాలని లోక్ సభ స్పీకర్ కు వారు విజ్ఞప్తి చేశారు. స్పీకర్ గ్రౌండ్ ఫ్లోర్ లోని 5వ నంబర్ గదిని కేటాయించారు. ఈ గదిలో అప్పటికే టిడిపి కార్యాలయం కొనసాగుతోంది. సరైన సంఖ్యాబలం లేనప్పటికీ.. టిడిపి అదే కార్యాలయంలో కొనసాగుతోంది. తాజాగా వైఎస్‌ఆర్‌సిపి ఎంపీల అభ్యర్థన మేరకు వారికి ఈ గదిని కేటాయిస్తూ స్పీకర్ ఓ ప్రకటన చేశారు.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/