ప్రారంభమైన అమెరికా అధ్యక్ష ఎన్నికలు

డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థి బైడెన్‌కే తొలి ఓటు

New Hampshire hamlet casts first US Election Day votes

వాషింగ్టన్‌: అధ్యక్ష ఎన్నికలకు అమెరికాలో ఓటింగ్‌ ప్రారభమైంది. ఈశాన్య రాష్ట్ర‌మైన న్యూ హ్యాంప్‌షైర్‌లోని డిక్స్‌విల్లీ నాచ్ గ్రామంలో మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున ప్ర‌జ‌లు ఓటేశారు. కెన‌డా బోర్డ‌ర్‌కు స‌మీపంలో ఉన్న అడ‌వుల్లో డిక్స్‌విల్లీ గ్రామం ఉన్న‌ది. 1960 నుంచి సాంప్ర‌దాయ‌బ‌ద్దంగా ఈ గ్రామం నుంచే అమెరికా ఎన్నిక‌ల రోజున ఓటింగ్ ప్ర‌క్రియ ప్రారంభం అవుతోంది. ఆ గ్రామంలో మొత్తం 12 మంది నివాసితులు ఉన్నారు. అయితే పోలైన‌ అయిదు ఓట్లు బైడెన్ ఖాతాలో ప‌డ్డాయి. ట్రంప్‌కు ఒక్క ఓటు కూడా పోల‌వ్వ‌లేదు. డిక్స్‌విల్లీ గ్రామ‌స్తులు ఏక‌ప‌క్షంగా డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థికి ఓటేశారు. అయితే డిక్స్‌విల్లీకి స‌మీపంలో ఉన్న మిల్స్‌ఫీల్డ్‌లో కూడా అర్థ‌రాత్రే ఓటింగ్‌లో పాల్గొంటుంది. మిల్స్‌ఫీల్డ్‌లో ట్రంప్‌కు 16 ఓట్లు పోల‌య్యాయి. బైడెన్‌కు అయిదు ఓట్లు వేశారు. గ‌త ఏడాది డిక్స్‌విల్లీ గ్రామం ఓట‌ర్లు హిల్ల‌రీ క్లింట‌న్‌కు ఓటేశారు. కానీ ఆ ఎన్నిక‌ల్లో ట్రంప్ విజ‌యం సాధించారు. మరో గ్రామం హార్ట్స్ .. క‌రోనా వ‌ల్ల ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/