తెలంగాణ కు కొత్త గవర్నర్ రాబోతున్నారా..?

తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్ రాబోతున్నారా..ప్రస్తుతం ఇదే వార్త పలు మీడియా పత్రికల్లో చక్కర్లు కొడుతుంది. గత కొద్దీ రోజులుగా తెరాస గవర్నమెంట్ కు గవర్నర్ తమిళి సై మధ్య విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తెరాస ప్రభుత్వం తనను లెక్క చేయడం లేదని , ఓ గవర్నర్ అనే మర్యాద ఇవ్వడం లేదని , ఎక్కడికి వెళ్లిన అధికారులు కనీస గౌరవం ఇవ్వడం లేదని కేంద్రానికి తెలిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రం తమిళి సై స్థానంలో మరో గవర్నర్ ను నియమించే ఆలోచనలో ఉన్నట్లు పలు మీడియా లలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తమిళి సై ని తమిళనాడుకు పంపించి..తెలంగాణ కు కొత్త గవర్నర్ ను నియమించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం తమిళి సై ఢిల్లీ లో ఉంది. మరోసారి మీడియా ముందుకు వచ్చి పలు వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా విమర్శించారని, పాత వీడియోలతో సోషల్ మీడియాలో ట్రోల్ చేశారనే విషయాన్ని ఆమె గుర్తు చేశారు. తాను ప్రభుత్వం రద్దు చేస్తా అని అనలేదని, ఇతర రాష్ట్రాల్లో గవర్నర్ తో విభేదించినా, రాజ్ భవన్ ను గౌరవిస్తున్నారనే విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ గవర్నర్ గా మాత్రమే పని చేస్తానని, రాజకీయం చెయ్యాల్సిన అవసరం లేదు.. చెయ్యాలనే ఆలోచన లేదని కుండబద్ధలు కొట్టారు. రాజకీయం చేస్తున్నట్లు అనవసరంగా విమర్శిస్తున్నారని, ఆధారాలు లేకుండా ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించటం తప్పా ? ప్రజలను కలిస్తే తప్పుగా అర్ధం చేసుకుంటున్నారన్నారు. ఏ పదవిలో ఉన్నా, ప్రజలకు సేవ చేయుటo తన లక్ష్యమని స్పష్టం చేశారు.