గూగుల్‌ మ్యాప్స్‌లో మరో కొత్త అప్‌డేట్‌

google maps
google maps

హైదరాబాద్‌: ఇప్పటికే ప్రతి ఒక్కరి స్మార్ట్‌ ఫోన్‌ లో ఇన్‌ స్టాల్‌ అయి, తెలియని ప్రాంతాలకు దారిని చూపిస్తున్న గూగుల్‌ మ్యాప్స్‌, ఇప్పుడు ఇంకో మంచి అప్‌ డేట్‌ను కస్టమర్ల ముందుకు తీసుకువచ్చింది. మహిళలకు రక్షణగా ఉండటం, ముఖ్యంగా రాత్రిళ్లు ప్రయాణం చేసే వారు క్షేమంగా తమ గమ్యానికి చేరుకునే దిశగా, వెలుగు ఎక్కువగా ఉండే వీధులను ముందే గుర్తించి తెలియజెప్పనుంది. దీని ద్వారా చీకటిగా ఉన్న ప్రాంతాలను తెలుసుకుని, ఆ దిశగా వెళ్లకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవచ్చని గూగుల్‌ పేర్కొంది. లైటింగ్‌ పేరిట ఈ ఆప్‌ డేట్‌ను ఎక్స్‌ డీఏ డెవలపర్స్‌ అభివృద్ధి చేసిందని, వీధి టైట్లు వెలుగుతున్న ప్రాంతాలకు ఇది గుర్తించి, మ్యాప్స్‌ లో చూపుతుందని, లైట్లు ఉన్న వీధులు పసుపు రంగులో కనిపిస్తుంటాయని వెల్లడించింది. గూగుల్‌ మ్యాప్స్‌ బీటావర్షన్‌ను ఆప్‌ డేట్‌ చేసుకుని ఈ సదుపాయాన్ని పొందవచ్చని తెలిపింది. ఈ అప్‌ డేట్‌ను పైలట్‌ ప్రాజెక్టుగా ఇండియాలో ప్రారంభించామని, పరీక్షించి, కస్టమర్ల అభిప్రాయం తెలుసుకున్న తరువాత ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తామని పేర్కొంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/