విద్యారంగంలో కొత్త శకానికి నాంది

3వ జాతీయ విద్యావిధానం

new era in education-
new era in education-

దాదాపుగా 34 సంవత్సరాల తర్వాత విద్యావిధానంలో సమూలమైన మార్పులకు భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టి నూతన జాతీయ విద్యావిధానాన్ని తీసుకువచ్చింది.

స్వాతంత్య్రభారత దేశంలో 1968,1986 తర్వాత ఇప్పుడు 2020లో మూడవ జాతీయ విద్యావిధానాన్ని భారత ప్రభుత్వం తీసుకొచ్చింది.దీనిద్వారా ఆధునికమైన విద్యావిధానంతో ప్రపంచ స్థాయి విద్యావ్యవస్థతో పోటీ పడటానికి అవకాశం ఏర్పడింది.

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ తన 2014 ఎన్నికల మేనిఫెస్టోలో నూతన విద్యావిధానాన్ని పొందు పరిచింది. నూతన జాతీయ విద్యావిధానం ద్వారా పాఠశాల విద్యావ్యవస్థ నుండి యూనివర్శిటీ విద్యావ్యవస్థ వరకు అన్నింటిలో సమూలమైన మార్పులని ప్రతిపాదించింది.

గత 34 సంవత్సరాలలో ఆలోచన విధానం, జీవన విధానం, సాంకేతికమైన విధానంలో చాలా మార్పులు చోటు చేసుకున్నా యి. దానికి తగ్గట్టుగా నూతన విద్యావ్యవస్థను మార్చాల్సిన అవసరం ఏర్పడింది.

పాఠశాల విద్యావ్యవస్థలో ముఖ్యంగా ఇప్పుడున్న 10+2 వ్యవస్థను తీసి 5+3+3+4 వ్యవస్థను తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఉన్న 10+2 వ్యవస్థ సంప్రదాయ పద్ధతిలో అన్ని తరగతులకు ఒకే రకమైన విధానం ఉంది.

కానీ కొత్త 5+3+3+4లో అనగా విద్యార్థి మూడు సంవత్సరాల నుండి 18 సంవత్సరం వరకు వివిధ దశలలో వివిధ రకాల సబ్జెక్టులను చదువ్ఞతాడు. దాని ద్వారా విద్యార్థి అధునాతనమైన విద్యావ్యవస్థను అర్థం చేసుకోగలడు.

అలాగే కేంద్రీయ విద్యాల యంలోకి ప్రీస్కూలింగ్‌ని ప్రవేశపెట్టడం, జవహర్‌ నవోదయ విద్యాలయంలో ఉచిత వసతి కల్పించడం, 5వ తరగతికు తప్పనిసరిగా మాతృభాషలో బోధించడం, ఒక విద్యాసంవత్స రంలో రెండుసార్లు పరీక్షలు నిర్వహించడం లాంటి మార్పులని నూతన జాతీయ విద్యావిధానంలో రూపొందించారు.

జాతీయ విద్యావిధానం ఉన్నత విద్యలో కూడా సమూలమైన మార్పులకు శ్రీకారం చుట్టింది.

యూనివర్శిటీ, కళాశాల నియంత్రణకుగానూ నేషనల్‌ హైయర్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ ప్రమాణాలను పెంపొం దించేందుకు గాను జనరల్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌,ఉన్నత విద్యకు నిధులు సమకూర్చేందుకుగాను హైయర్‌ ఎడ్యుకేషన్‌ గ్రాంట్స్‌ కౌన్సిల్‌. యూనివర్శిటీ, కళాశాలకు గుర్తింపు ఇచ్చేందుకుగాను నేషనల్‌ అక్రెడిషన్‌ కౌన్సిల్‌ అనేనాలుగు విభాగాలు ఉన్నత విద్యని విడకొట్టి వీటి అన్నింటిని హైయర్‌ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా అనే గొడుగుకిందకి తీసుకువచ్చింది.

ఆ నాలుగు విభాగాలు ముఖ్యంగా పారదర్శకత, ఆధునిక పరిస్థితులకి అనుకూలమైన సాంకేతికతని ఉపయోగించి ఉన్నత విద్యలో ప్రపంచస్థాయి విద్యావ్యవస్థలో పోటీపడే విధంగా రూపొందించారు.

అలాగే భారత్‌ లాంటి దేశంలో 19.1 శాతం జనాభా 19-25 సంవత్సరాల మధ్య ఉన్నారు. వీరిలో చాలామంది పాఠశాలవిద్య అయిపోగానే వివిధ కారణాలు వలన యూనివర్శిటీ విద్యను మానేస్తున్నారు.

new era in education

దీనివల్ల నిరుద్యోగం పెరిగిపోతుంది. యూనివర్శిటీ విద్యలోకి ప్రవేశాలని 50 శాతం పెంచాలని ప్రభుత్వం జాతీయ విద్యావిధానంలో పొందుపరిచింది. ఇది అమలులోకి రావాలంటే 3.5 కోట్లు సీట్లు పెంచాల్సిన అవసరం ఉంది.

ఇంకొక ముఖ్యమైన మార్పు బహుళ విభాగాల పరిశోధన ప్రతిపాదన, ప్రపంచంలోని దాదాపుగా ముఖ్యమైన అన్ని విశ్వ విద్యాయాలలో బహుళవిభాగాల పరిశోధనజరుగుతుంది.

దానికి తగ్గట్టుగా భారత్‌లో కూడా బహుళవిభాగాల పరిశోధన విధానం కోసం 2030 కల్లా ప్రతి జిల్లాకి ఒక బహుళ విభాగాల యూని వర్శిటీ ఉండాలని జాతీయ విద్యావిధానంలో ప్రతిపాదించారు. 2040 కల్లా అన్ని ఉన్నత విద్యాకళాశాలలని బహుళవిభాగాల కళాశాలలుగా మార్చాలని కంకణం కట్టుకుంది.

అలాగే విద్యకు జిడిపిలో కేవలం 1.7శాతం మాత్రమే కేటాయిస్తున్నారు. దానిని ఆరు శాతానికి పెంచాలని జాతీయ విద్యావిధానంలో పొందుపరి చారు. అలాగే ప్రపంచంలో టాప్‌ 100 ర్యాంక్‌లోపు ఉన్న విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లను భారత్‌లో పెట్టడానికి నూతన జాతీయ విద్యావిధానంలో అవకాశం కల్పించారు.

దీనిద్వారా భారత్‌లో విద్యావ్యవస్థ వ్యాపారం అవ్ఞతుంది. అని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. కానీ ఫీజుని నియంత్రించే రేగులేటరీ బాడీ ఒకటి ఉంటది అని వారు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి సంవ త్సరం భారత్‌ నుండి 7,50,000 మంది ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తున్నారు.

వాళ్ల నుండి వేలకోట్ల రూపాయలు విదే శాలకు వెళ్తుంది. దాని వలన భారత్‌ విదేశీ మారకద్రవ్యాలను నష్టపోతుంది. ఇప్పుడు ఆ విశ్వవిద్యాలయాల స్థాపన వలన మనదేశం నుండి విదేశాలకు ఉన్నత విద్యకోసం వెళ్లేవారు తగ్గు తారు.

నూతన విద్యావిధానంలో డిగ్రీచదివే విద్యార్థి కాలేజీ నుండి ఏ సంవత్సరంలో అయినా మానేసి దానికి తగ్గ సర్టిఫికెట్ తీసుకొనివెళ్లవచ్చు. దాని వల్లనవిద్యార్థికి ఒత్తిడి తగ్గుతుంది.

ఇటువంటి మార్పుల వల్ల నూతన జాతీయ విద్యావిధానం ఇప్పుడున్న కాలానికి అనుగుణంగా ప్రపంచస్థాయి ప్రమాణాలకు పోటీ ఇచ్చే విధంగా రూపొందించబడినది.

  • వెంకట కృష్ణారావు

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/