ఢిల్లి కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా సిద్ధూ !?

Sidhu
Sidhu

New Delhi: కాంగ్రెస్‌ పార్టీ ఢిల్లి శాఖ అధ్యక్షుడిగా నవ్‌జ్యోత్‌సింగ్‌ సిద్ధూ నియమితులవుతున్నారంటూ వార్తలు వెలువడ్డాయి. ఢిల్లి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ మరణం తరువాత అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. ఈ పదవిలో సిద్ధూను నియమించనున్నారంటూ వార్తలు వెలువడ్డాయి. పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్‌తో వేభాదల కారణంగా తన మంత్రి పదవికి రాజీనామా చేసిన సిద్ధూ ఢిల్లి కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టనున్నారని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఢిల్లి కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి పిసి చాకో మాత్రం దీనిని కొట్టివేశారు. తనకు తెలిసిన మేరకు అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని చాకో చెప్పారు.


Read more updates on National News in Telugu & International News in Telugu, also follow us on twitter and like our facebook page to get more updates on your social network.