ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 25 కేసులు
రాష్ట్రంలో మొత్తం కేసులు: 2,230

ముఖ్యాంశాలు
- గడిచిన 24 గంటల్లో ఒకరు మృతి
- ఇప్పటిదాకా మొత్తం మృతులు: 50
- నెల్లూరు,గుంటూరుజిల్లాల్లో కొత్తగా 4 కేసులు
Amaravati:
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా పాతిక మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. గత 24 గంటలలో 9,880 కరోనా పరీక్షలు నిర్వహించగా 25 పాజిటివ్ కేసులు వచ్చాయని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.
కాగా కొత్తగా నమోదైన కేసులతో కలిసి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2230కి చేరుకుంది.
గత 24 గంటల్లో కరోనా కారణంగా ఒకరు మరణించారు. దీంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 50కి పెరిగింది.
కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో నాలుగు చొప్పున, కర్నూలులో 3, నెల్లూరులో ఒకటి, ప్రకాశంలో మూడు, శ్రీకాకుళంలో 7, విశాఖలో 3 కేసులు ఉన్నాయి.
తాజా కెరీర్ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/