మూసిపై కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చిన తలసాని

మూసి నది ఉదృతికి మూసారాంబాగ్ బ్రిడ్జి చాలా వరకు దెబ్బతిన్నది. ప్రస్తుతం నది ప్రవాహం తగ్గడం తో బ్రిడ్జ్ పై రాళ్లు, చెత్త, బురద ను GHMC కార్మికులు తొలగించారు. వరద ప్రవాహం దృష్ట్యా మంగళవారం నుండి బ్రిడ్జ్ పై రాకపోకలను నిషేదించగా..ప్రస్తుతం ప్రవాహం తగ్గడం తో వాహనాల రాకపోకలను అనుమతించారు. ఈరోజు శుక్రవారం ముసారాంబాగ్ వద్ద బ్రిడ్జిని మంత్రులు మహమ్మద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, వాటర్ బోర్డ్ ఎండి దాన కిషోర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. రూ.52 కోట్లతో ముసారాంబాగ్ అంబర్ పేట, ఆలీ కేఫ్ మార్గంలో మూసిపై కొత్త బ్రిడ్జి నిర్మాణం చేస్తామన్నారు. పది రోజులలో ఈ నూతన బ్రిడ్జి పనులు ప్రారంభం అవుతాయని మంత్రి తలసాని అన్నారు. 9 నెలల పాటు ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోతాయన్నారు. హైదరాబాద్ నాలా అభివృద్ధి పనులు వచ్చే వర్షాకాలానికి పూర్తి అవుతాయని , మూసి పరిసరాల్లో రిటైనింగ్ వాల్ నిర్మాణం పనులు చేపడుతామని తలసాని చెప్పుకొచ్చారు.