త్వరలో మారనున్న టీమిండియా జెర్సీ

ఒప్పోకి బదులు బైజుస్‌

Indian team
Indian team

న్యూఢిల్లీ: టీమిండియా ఆటగాళ్ల జెర్సీలపై త్వరలో కొత్త బ్రాండ్‌ కనపడనుంది. చ్చేనెల ఆగస్టులో వెస్టిండీస్‌ పర్యటన వరకే కోహ్లీసేన జెర్సీలపై ఒప్పో బ్రాండ్‌ కనిపిస్తుంది. ఆ తరువాత జెర్సీలపై ఒప్పో బ్రాండ్‌కు బదులు బైజుస్‌ తన బ్రాండ్‌ను దర్శనమివ్వబోతోంది. కాగా ఆగస్టు 3 నుంచి మూడు టీ20లు, మూడు వన్డేలతో పాటు రెండు టెస్టులు ఆడనుంది. ఈ పర్యటన సెప్టెంబర్‌ 2న పూర్తవుతుంది. సెప్టెంబర్‌ 15న ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా పర్యటన నుంచి బెంగళూరుకు చెందిన ఆన్‌లైన్‌ ట్యుటోరియల్‌ సంస్థ బైజుస్‌ తన బ్రాండ్‌ను కొనసాగించనుంది.

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ సంస్థ ఒప్పో.. 2017 మార్చిలో టీమిండియా స్పాన్సర్‌షిప్‌ను రూ.1079 కోట్లకు ఐదేళ్ల పాటు బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకుంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/