ఎయిర్‌పోర్టుకు కొత్త కళ

gannavaram airport
gannavaram airport

విజయవాడ ప్రభాతవార్త : గన్నవరం ఎయిర్‌పోర్టు విద్యుత్ కాంతులతో మెరిసిపోతోంది. ఈ ఎయిర్‌పోర్టు నుంచి మంగళవారం సాయంత్రం అంతర్జాతీయ విమానం సింగపూర్ వెళ్లనుంది. ఇందుకోసం ఎయిర్‌పోర్టు సిబ్బంది ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఏర్పాట్లను కలెక్టర్ లక్ష్మీకాంతం, విజయవాడ కమిషనర్ ద్వారకా తిరుమలరావు పరిశీలించారు. ఎయిర్‌పోర్టు డైరెక్టర్ మధుసూదన్ రావును వివరాలు అడిగి తెలుసుకున్నారు.