తిరుమలలో భక్తుల కోసం కొత్త ఏర్పట్లు

తిరుమల: తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఇక నుండి క్యూలో వేచిఉండే అవసరం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో సింఘాల్ తెలిపారు. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతు హైదరాబాద్ జూబ్లీహిల్స్లో శ్రీవారి ఆలయానికి ఈనెల 8న అంకురార్పణ, 13వ తేదీన విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందన్నారు. అలాగే ఏప్రిల్ 13 నుంచి 21 వరకు ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు. 18వతేదీన సీతారాముల కళ్యాణం జరుగుతుందని ఈవో తెలిపారు. కాగా… ఫిబ్రవరి నెలలో 18.87 లక్షలమంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని, హుండీ ద్వారా రూ. 83.11 కోట్లు ఆదాయం లభించిందని, 82.06 లక్షల లడ్డూలు భక్తులకు అందించామని ఈవో తెలిపారు.