ఐసిఐసిఐ బ్యాంకు కొత్త కార్యాచరణ

ICICI BANK
ICICI BANK

న్యూఢిల్లీ, : భారతదేశంలో అప్పులిచ్చే రెండో అతిపెద్ద ప్రైవేట్‌ రంగ బ్యాంకు ఐసిఐసిఐ. ఇప్పుడు ఇది తమ శాలరైడ్‌ వినియోగదారులకు ఆన్‌లైన్‌ ద్వారా గృహ రుణాలు ఇవ్వడం ద్వారా హోంలోన్‌ మార్కెట్‌లో మరింత అగ్రెసివ్‌గా వెళ్తోంది. తమ వినియోగదారులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవడంతో పాటు అదే డిజిటిల్‌ మార్గంలో తక్షణ అప్రైవల్‌ను కూడా తీసుకువస్తోంది. ఈ మేరకు ఐసిఐసిఐ బ్యాంకు రెండు రకాల గృహ రుణాలను ప్రకటించింది. ఈ మేరకు మార్చి 27వ తేదీన ఐసిఐసిఐ ప్రకటన చేసింది. ఎగ్జిస్టింగ్‌ కస్టమర్లకు క్రెడిట్‌ స్కోర్‌ ఆధారంగా లక్షల రూపాయల నుంచి రూ.కోటి వరకు రణ సదుపాయం కల్పిస్తామని తెలిపింది. వినియోగదారుల అకౌంట్‌, క్రెడిట్‌ బ్యూరో చెక్కులు, శాలరీక్రెడిట్స్‌, యావరేజ్‌ బ్యాలెన్స్‌, రీపేమెంట్‌ ట్రాక్‌ వంటి వాటి ఆధారంగా ఈ ఇంటిరుణాలు ఇస్తున్నట్లు తెలిపారు. ఎగ్జిస్టింగ్‌ ఇంటిరుణం వినియోగదారులకు కూడా గుడ్‌న్యూస్‌ అందించింది. రూ.20లక్షల రకు పదేళ్ల పరిమితికి గాను ఇన్‌స్టాంట్‌ టాపప్‌ రుణాలు కూడా అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. దీనికి విభిన్న వడ్డీరేట్లు ఉండవు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడంతో పాటు, సత్వరం తుది ఆమోదం కూడా డిజిటల్‌ పద్ధతిలోనే పొందే ఈ రెండు రకాల ఇంటిరుణాలను ఐసిఐసిఐ ప్రకటించింది. ఇందులో ఇన్‌స్టాంట్‌ హోమ్‌లోన్‌ పథకం కింద ఐసిఐసిఐ బ్యాంకులో ఖాతా కలిగిన, ముందస్తు ఆమోదం పొందిన ఉద్యోగులు ముప్పై ఏళ్ల వ్యవధికి రూ.కోటి వరకు గృహ రుణం ఇస్తారు. ఇరటర్నెట్‌ బ్యాంకింగ్‌ సదుపాయాన్ని వినియోగించుకుని డిజిటల్‌ పద్ధతిలో వెంటనే ఈ రునం పొందే అవకాశముంది. ఇన్‌స్టా టాప్‌ అప్‌లోన్‌ పథకం కింది ఇప్పటికే గృహ రుణం ఉన్న ఖాతాదారులు పదేళ్ల వ్యవధితో రూ.20లక్షల వరకు అదనపు హోమ్‌ లోన్‌ అవకాశం కల్పించింది. కాగితాలతో పనిలేకుండా డిజిటల్‌ పద్ధతిలో ఈ రుణాలు పొందవచ్చు. ఈ రుణాలకు సంబంధించిన మొత్తం కస్టమర్‌ అకౌంట్‌లోకి వస్తాయి. సాధారణంగా రుణాలు మంజూరు కావడానికి వారం రోజులుగానీ, అంతకంటే ఎక్కువ పడుతుంది. కానీ ఈ ప్రక్రియలో ఒక్క క్లిక్‌తో రుణ సౌకర్యం పొందవచ్చు. ఆ తర్వాత వినియోగదారు బ్యాంకును సందర్శించి, కాంటాక్ట్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌ను సాంక్షన్‌ లెటర్‌తో సంప్రదించాయి. అలాగే, వారు కొనుగోలు చేయాలనుకునే ఇంటికి సంబంధించిన పత్రాలు తీసుకువెళ్లాలి. ఇన్‌స్టాంట్‌ సాంక్షన్‌ కోసం ముందుగానే ఇల్లు చూపించాల్సి ఉంటుంది.
మరిన్ని తాజా బిజినెస్‌ జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: