భారత్‌లో కొత్తగా 1990 కరోనా కేసులు

మహారాష్ట్రలో అధికంగా నమోదు అవుతున్న కేసులు

corona virus
corona virus

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విజృంభణ తీవ్ర రూపం దాల్చుతుంది. ఒక్కరోజులోనే 1990 రనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 26, 496 కు చేరుకుంది. కాగా దేశవ్యాప్తంగా కరోనా బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య 824 కు చేరుకుంది. దేశం మొత్తంలో ఒకే రోజు ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఈ వైరస్‌ బారినుండి 5084 మంది కోలుకోగా 19,868 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అత్యధికంగా కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదు అవుతున్నాయి. ఇప్పటికే అక్కడ 7628 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. అదే విధంగా మరణాలు కూడా భారీ సంఖ్యలోనే ఉంటున్నాయి. ఇప్పటి వరకు 323 మంది ఈ వైరస్‌ కారణంగా మరణించారు. ఇక తెలుగు రాష్ట్రాలలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 1016 కరోనా కేసులు నమోదు కాగా, తెలంగాణ లో కరోనా కేసుల సంఖ్య 991 కి చేరుకుంది

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/