మోడి బాటలో నడుస్తారని ఎప్పుడు అనుకోలేదు!

siddaramaiah & Yediyurappa
siddaramaiah & Yediyurappa

బెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టాన్ని కర్ణాటకలో అమలు చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప తెలిపిన సంగతి తెలిసందే.
కాగా ఈ వ్యాఖ్యలపై సీఎం యడియూరప్పపై కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ట్విట్టర్‌ వేదికగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వరుస నిర్ణయాలతో రాజ్యాంగ విలువలకు తూట్లు పొడుస్తున్న పాలకులు బెంగళూరులో 144 సెక్షన్‌ విధించడం ద్వారా శాంతియుతంగా నిరసన తెలిపే రాజ్యాంగ అవకాశం కూడా లేకుండా చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రగతిశీల భావాలతో ఉండే యడియూరప్ప..ప్రధాని మోడి బాటలో నడుస్తారని ఎప్పుడూ అనుకోలేదన్నారు. యడియూరప్ప మిమ్మల్ని చూసి సిగ్గుపడుతున్నా అంటూ ట్వీట్‌ చేశారు.

తాజా ఎపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/