‘Biggboss’ ను బ్యాన్ చేసి ‘EMK’ చూడండి అంటూ పెద్ద ఎత్తున కామెంట్స్

నార్త్ లో సూపర్ సక్సెస్ అవుతూ వస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షో..సౌత్ లోను అంతే సక్సెస్ ఫుల్ గా అలరిస్తుంది. ఇప్పటికే తెలుగు లో నాల్గు సీజన్లు పూర్తీ చేసుకొని..రీసెంట్ గా ఐదో సీజన్ మొదలుపెట్టుకుంది. అయితే ఈ షో పట్ల కొంత పాజిటివ్ , కొంత నెగిటివ్ ప్రచారం నడుస్తుంటుంది. అది ఈరోజు కాదు మొదటి సీజన్ నుండి వ్యతిరేక కామెంట్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా అలాగే మొదలైంది. కాకపోతే ఈసారి బిగ్ బాస్ చూడడం మానేసి ఎవరు మీలో కోటేశ్వర్లు షో చూస్తే కనీసం జనరల్ నాలెడ్జ్ అయినా వస్తుందని అంటున్నారు.

టీవీ మందు గంటల తరబడి కూర్చుని బిగ్ బాస్ చూడడం వల్ల ఎటువంటి విజ్ఞానం లభించకపోగా, కంటెస్టెంట్స్ పిచ్చి పిచ్చి చేష్టలు చూడాల్సి వస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కంటెస్టెంట్స్ ఓవర్ యాక్షన్స్, ఏదేని విషయమై రియాక్షన్స్ ద్వారా మానవ సంబంధాలపై ప్రభావం ఉంటుందని మానసిక నిపుణులు సైతం తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ప్రోగ్రాం ప్రొడ్యూసర్స్ ఈ షోను ప్లాన్ చేసింది టీఆర్పీ రేటింగ్స్ కోసమే అనేది నిర్వివాదాంశం. అయితే, ఈ షోను ఎక్కువ సేపు చూస్తే జనాలు ఇబ్బందుల పాలవుతారనే వాదన వినబడుతోంది. గతంలో రాజకీయ నేతలు సైతం బిగ్ బాస్ షో పట్ల వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. బిగ్ బాస్ ఫై వస్తున్న కామెంట్స్ పట్ల బిగ్ బాస్ అభిమానులు మాత్రం ఇవన్నీ కామన్..షో మొదలైనప్పుడు ఎప్పుడు కూడా ఇలాగే జరుగుతుంటుంది..కొన్ని రోజులైతే వారే ఇంట్రస్ట్ గా షో చూస్తారని అంటున్నారు. ఏది ఏమైనప్పటికి ప్రస్తుతం బిగ్ బాస్ ఫై వస్తున్న కామెంట్స్ వైరల్ గా మారాయి.