తాలిబాన్లకు మద్దతు పలికిన మాజీ క్రికెటర్..

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది.. తాలిబ‌న్ల‌ఫై పాజిటివ్ కామెంట్స్ చేయడం తో ఆయనపై నెటిజన్లు విరుచుకపడుతున్నారు. ‘‘అఫ్గాన్‌లో తాలిబన్లు ఒక పాజిటివ్ మైండ్‌తో అధికారంలోకి వచ్చారు. వాళ్లు మహిళలను ఉద్యోగాలు చేసుకోనిస్తున్నారు. రాజకీయాల్లో కూడా మహిళలకు అవకాశం కల్పిస్తున్నారు..అలాగే తాలిబాన్లకు క్రికెట్‌ అంటే ఇష్టమని అనుకుంటున్నానని ..వాళ్ల రాకతో అఫ్గాన్‌లో క్రికెట్ మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నానని” అఫ్రిది అన్నాడు.

ఈ కామెంట్స్ ఫై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఓ పక్క తాలిబ‌న్ల నుంచి త‌ప్పించుకోవ‌డానికి ల‌క్ష‌లాది మంది, ముఖ్యంగా మ‌హిళ‌లు, ఇల్లూవాకిలి వ‌దిలేసి వెళ్లిపోతుంటే అఫ్రిది మాత్రం వాళ్ల‌ను పొగుడుతూ మాట్లాడ‌టం సరికాదని అంటున్నారు. తాలిబ‌న్లు ఎన్ని శాంతి ముచ్చట్లు చెపుతున్న.. మ‌హిళ‌ల ప‌ట్ల వాళ్ల వైఖ‌రి మార‌లేద‌ని ఈ రెండు వారాల్లోనే తేలిపోయింది అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక నిన్నటి వరకు అమెరికా సైనికులు..తమ దేశ పౌరులను పంపించే పనిలో ఉండగా..ఆగస్టు 31 తో గడువు పూర్తి కావడం తో సోమవారం అర్ధరాత్రి అఫ్గానిస్థాన్​ నుంచి అమెరికా చిట్టచివరి విమానం సీ-17 వెళ్లిపోయింది. అమెరికా యుద్ధం ముగియడంతో మంగళవారం తెల్లవారుజామున కాబూల్‌లో వేడుకలకు గుర్తుగా గాల్లోకి కాల్పులు జరిగాయి. ఈ సంఘటనపై తాలిబాన్ సీనియర్ నేతలు హర్షం వ్యక్తం చేశారు.

❝Taliban have come with a very positive mind. They’re allowing ladies to work. And I believe Taliban like cricket a lot❞ Shahid Afridi. He should be Taliban’s next PM. pic.twitter.com/OTV8zDw1yu— Naila Inayat (@nailainayat) August 30, 2021