మరో దేశంలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ నిషేధం

రక్తం గడ్డ కడుతోందని ఆరోపణలు

ద హేగ్‌: ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి ప్రముఖ ఫార్మా సంస్థ ఆస్ట్రాజెనెకా రూపొందించిన కరోనా వ్యాక్సిన్ కు పలు దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆ వ్యాక్సిన్ వాడకం అనంతరం రక్తం గడ్డకట్టడం, ప్లేట్ లెట్లు పడిపోవడం వంటి దుష్పరిణామాలు చోటుచేసుకుంటున్నాయంటూ ఆస్ట్రియా, నార్వే, డెన్మార్క్ వంటి దేశాలు ఆరోపిస్తున్నాయి. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వినియోగంపై నిషేధం విధించాయి. ఇప్పుడీ దేశాల సరసన నెదర్లాండ్స్ కూడా చేరింది.

ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయంటూ నెదర్లాండ్స్ ఈ వ్యాక్సిన్ ను నిషేధించింది. రెండు వారాల పాటు దేశంలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వినియోగాన్ని నిలిపివేస్తున్నట్టు జాతీయ ఔషధాల పనితీరు నిర్ధారణ బోర్డు ప్రకటించింది. ఈ నిషేధం మార్చి 28 వరకు వర్తిస్తుందని నెదర్లాండ్స్ ఆరోగ్యశాఖ మంత్రి హ్యోగో డి జోంగే వెల్లడించారు. ప్రజల్లో వ్యాక్సిన్ పై అనుమానాలు ఉన్నప్పుడు పరిశీలించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/