ఇజ్రాయెల్‌ ప్రధానికి తప్పిన పెను ప్రమాదం

ఎన్నికల ప్రచారం సందర్భంగా రాకెట్ దాడి

Netanyahu
Netanyahu

ఇజ్రాయెల్‌: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నారు. దక్షిణ ఇజ్రాయెల్ లోని అష్కిలోన్ లో నిన్న రాత్రి ఎన్నికల ప్రచారం కార్యక్రమం సందర్భంగా ఆయనపై రాకెట్ దాడి జరిగింది. గాజా వైపు నుంచి ఈ రాకెట్ దూసుకొచ్చింది. అయితే, ఇజ్రాయెల్ డోమ్ రక్షణ వ్యవస్థ మధ్యలోనే ఆ రాకెట్ ను ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో, తన ప్రసంగం ప్రారంభమైన రెండు నిమిషాలకే నెతన్యాహు ప్రసంగాన్ని ఆపేశారు. భద్రతా సిబ్బంది ఆయనను హుటాహుటిన అక్కడి నుంచి తరలించారు. పావుగంట తర్వాత ఆయన మళ్లీ వేదికపైకి వచ్చారు. కాగా సెప్టెంబర్ లో కూడా నెతన్యాహును టార్గెట్ చేస్తూ ఒక రాకెట్ దాడి జరిగింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/