నేతాజీ కి ఘన నివాళులు

పార్ల‌మెంట్ సెంట్ర‌ల్ హాలులో సుభాస్ చంద్రబోస్ 125వ జయంతి

Prime Minister Modi pays tribute to Subhash Chandra Bose
Prime Minister Modi pays tribute to Subhash Chandra Bose

New Delhi: పార్ల‌మెంట్ సెంట్ర‌ల్ హాలులో నేతాజీ చిత్ర‌ప‌టం వ‌ద్ద పుష్పాల‌ను ఉంచి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నివాళుల‌ర్పించారు. స్వాతంత్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జ‌యంతి. ఈ సంద‌ర్భంగా ఆదివారం నేతాజీ సేవ‌ల‌ను స్మ‌రించుకున్నారు. నేతాజీ త్యాగం ప్రతి భారతీయుడికి ఎప్పటికీ స్ఫూర్తినిస్తుందని అన్నారు. అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు నమస్కరిస్తున్నానని, దేశానికి ఆయన చేసిన స్మారక సహకారానికి భారతీయుడుగా గర్విస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా , సుభాష్ చంద్రబోస్‌ను స్మరించుకుంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా భారత దేశం ఆయనకు నివాళులు అర్పిస్తుందని ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని గణతంత్ర దినోత్సవాలను ఆదివారం నుంచే ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఇండియా గేట్‌ వద్ద నేతాజీ హోలోగ్రామ్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అక్కడ గ్రానైట్‌తో విగ్రహం ఏర్పాటు చేయనున్నట్టు ఇటీవల ప్రధాని ప్రకటించిన విషయం విదితమే . ఆ గ్రానైట్ విగ్రహం నిర్మాణం అయ్యేంత వరకూ ఆ ప్రాంతంలో హోలోగ్రాం ప్రతిమ ఉండనుందని తెలిసింది.

అంతర్జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/international-news/