కొత్త మ్యాప్‌కు నేపాల్‌ పార్లమెంట్‌ ఆమోదం

ప్రెసిడెంట్ సంతకం చేస్తే బిల్లుకు చట్టబద్ధత

nepal-new-map-bill-passed-in-parliament-upper-house

నేపాల్‌: నేపాల్ కొత్త మ్యాప్‌కు పార్లమెంటు ఎగువసభ (నేషనల్ అసెంబ్లీ) ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ మ్యాప్ లో భారత భూభాగాలు కూడా ఉన్నాయి. గత శనివారం ఈ మ్యాప్ కు ఆ దేశ పార్లమెంటులోని దిగువసభ ఆమోదముద్ర వేసింది. ఇప్పుడు ఎగువసభ కూడా ఆమోదం తెలపడంతో దేశాధ్యక్షుడి వద్దకు బిల్లు వెళ్లనుంది. ఆయన సంతకం చేసిన తర్వాత కొత్త మ్యాప్ ను రాజ్యాంగంలో చేరుస్తారు. భారత్ కు మిలిటరీ పరంగా ఎంతో కీలకమైన కాలాపానీ, లిపులేక్, లింపియధురా ప్రాంతాలను కొత్త మ్యాప్ లో నేపాల్ చేర్చింది. భారత్ పెడుతున్న అభ్యంతరాలను సైతం లెక్కచేయకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. దీనికి సంబంధించిన బిల్లుకు ఎగువసభలో ఉన్న మొత్తం 57 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఓటు వేశారు. కాగా మే 20వ తేదీన ప్ర‌ధాని ఓలే.. నేపాల్‌కు చెందిన కొత్త రాజ‌కీయ‌, పరిపాల‌న సంబంధిత మ్యాప్‌ను రిలీజ్ చేశారు. లిపులేఖ్ మీదుగా కైలాస్ మాన‌స స‌రోవ‌రానికి రోడ్డు మార్గాన్ని మే 8వ తేదీన భార‌త్ ఓపెన్ చేసింది. ఆ అనంత‌రం నేపాల్ త‌న కొత్త మ్యాప్‌ను రిలీజ్ చేసింది.



తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/