మోడికి నేపాల్ ప్రధాని శుభాకాంక్షలు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి పుట్టినరోజు సందర్భంగా నేపాల్ ప్రధాని కేపీశర్మ ఓలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. మోడి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. రెండుదేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు పని చేయడం కొనసాగిస్తామని పేర్కొన్నారు. కాగా ప్రధాని మోడి జన్మదినం సందర్భంగా ఆయనకు దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు మోడి బర్త్ డే విషెస్ తెలిపారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/