భారత ప్రజలకు నేపాల్‌ ప్రధాని శుభాకాంక్షలు

Nepal PM greets PM Modi, people of India

ఖాడ్మండు: నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలీ నేడు 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడితో పాటు భారత ప్రజలకు శుభాకాంక్షలు.  ‘ఈ శుభదినం ప్రధాని మోడికి, భారత ప్రజలకు శుభాకాంక్షలు. భారత్‌ సర్వ శ్రేయస్సుతో మరింత పురోగమించాలి’ అని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. భారత భూభాగంలోని మూడు ప్రాంతాలను తమవిగా పేర్కొంటూ నేపాల్ కొత్త మ్యాప్‌ రూపొందించిన తరువాత ఇరుదేశాల మధ్య సంబంధాలు కొంత దెబ్బతిన్నాయి.

వివాదం తరువాత మొదటి స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో భారత ప్రధాని సందేశం ప్రాధాన్యత సంతరించుకుంది. నేపాల్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు చేయూతగా భారతనేపాల్ ద్వైపాక్షిక దీక్ష కింద భారత ప్రభుత్వం సాయం అందిస్తోంది. విద్య, ఆరోగ్యం, రోడ్ల నిర్మాణం, తాగునీరు, పారిశుధ్యం, వృత్తి శిక్షణ, వైద్యం తదితర రంగాల్లో నేపాల్‌కు సాయం అందిస్తూ వస్తోంది. 2003 నుంచి 77 జిల్లాల్లో 798.7 కోట్లకు పైగా వెచ్చించి 422 హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లను (హెచ్‌ఐసీడీపీ) పూర్తి చేసిందని ఖాట్మండులోని భారత రాయబారి కార్యాలయం తెలిపింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/