ఘోర బస్సు ప్రమాదం ..28 మంది మృతి
nepal-bus-crash-kills-at-least-28-in-mugu-district
కాఠ్మాండు: నేపాల్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలొ 28 మంది మరణించారు. ముగు జిల్లాలో ఈ ఘటన జరిగింది. మంగళవారం మధ్యాహ్నం బస్సు లోయలో పడినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరగడానికి కారణాలు తెలియరాలేదు. బ్రేక్లు ఫెయిల్ కావడం వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని కొందరు భావిస్తున్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని రెస్క్యూ దళాలు రక్షించాయి.
ఈ ఘటనపై విచారణ చేపడుతున్నట్లు పోలీసులు చెప్పారు. నేపాల్లో పండుగ సీజన్ నడుస్తోంది. చాలా మంది పండుగ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రయాణాలు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ డజను మందికి చికిత్సను అందించారు. ప్రమాదం సమయంలో బస్సులో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారో ఎవరికీ తెలియదు. కానీ మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/