నెల్లూరు జిల్లా టూరిజం ఆఫీసులో అమానుషం

మాస్క్ పెట్టుకొమన్నందుకు మహిళా ఉద్యోగిపై దాడి

Tourism deputy manager thrashes woman colleague

నెల్లూరు: నెల్లూరులోని ఏపి టూరిజం కార్యాలయంలో మాస్క్ పెట్టుకోమన్నందుకు మహిళ ఉద్యోగిపై ఓ అధికారి దాడి చేశాడు. అక్కడ డిప్యూటీ మేనేజ‌ర్‌గా విధులు నిర్వహిస్తున్న భాస్కర్‌రావు ముఖానికి మాస్క్ లేకుండా కార్యాలయానికి వచ్చాడు. దీంతో అక్కడే పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగిని ఉషారాణి ముఖానికి మాస్క్ పెట్టుకోమని సూచించింది. దీంతో ఆగ్రహానికి గురైన భాస్కర్‌రావు దివ్యాంగురాలైన ఉషారాణిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. మహిళ అని కూడా చూడకుండా ఇనుపరాడ్డుతో కొట్టాడు. పలువురు ఉద్యోగులు అడ్డుకున్నప్పటికీ.. అతను శాంతించలేదు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి భాస్కర్ రావును రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపైఏపి టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు స్పందించారు. బాధితురాలితో ఆయన ఫోన్లో మాట్లాడారు. ఆ రోజు కార్యాలయంలో ఏం జరిగిందో పూర్తి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ సైతం అధికారును ఆదేశించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/