విడుదలైన నీట్‌ పరీక్ష ఫలితాలు

NEET result
NEET result

న్యూఢిల్లీ: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) 2019 ఫలితాలు దేశవ్యాప్తంగా ఈరోజు విడుదలయ్యాయి. మొత్తం 15,19,375 మంది విద్యార్థులు నీట్‌కు రిజిస్టర్‌ చేసుకోగా 14,10,755 మంది విద్యార్థులు పరీక్షకు హాజయ్యారు. వీరిలో 7,97,042 మంది విద్యార్థులు అర్హత సాధించారు. అయితే రాజస్థాన్‌కు చెందిన నలిన్‌ ఖండేల్‌వాల్‌ అనే విద్యార్థి మొదటి ర్యాంకు సాధించి సత్తా చాటాడు. దిల్లీకి చెందిన భవిక్‌ బన్సాల్‌ అనే విద్యార్థి రెండో ర్యాంకు సాధించాడు. తెలంగాణకు చెందిన జి.మాధురిరెడ్డి అనే విద్యార్థిని ఏడో ర్యాంకు సాధించింది. 16వ ర్యాంకులో ఏపీ విద్యార్థిని కురేషే హస్రా నిలిచింది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/