మరిన్ని కష్టాల్లో నీరవ్‌

NEERAV
NEERAV

మరిన్ని కష్టాల్లో నీరవ్‌

న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో రూ.14వేల కోట్ల రుణాలను తీసుకొని కట్టకుండా ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న వజ్రాల కింగ్‌ నీరవ్‌ మోడీ ఆస్తులను గత వారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఇడి జప్తుచేసిన ఆస్తు ల్లో ముంబైలోని ఓ ఫ్లాట్‌తోపాటు అమెరికా, బ్రిటన్‌లోని స్థిరాస్తులు కూడా ఉన్నాయి. వీటన్నింటి విలువ రూ.700కోట్లు. అయితే నీరవ్‌ రూ.22.7కోట్ల విలువైన వజ్రాలు, ముత్యాలు పొదిగిన ఆభరణాన్ని హాంకాంగ్‌లో విక్రయించేందుకు ప్రయత్నిం చాడు. అయితే నీరవ్‌కు వరసకు తమ్ముడయ్యే వ్యక్తి దాన్ని అమ్మకుండా చేశాడు. అయితే ఇదివరకు నీరవ్‌ ఆభరణాలన్నీ సోదరుడైన నెహాల్‌మోడీ హాంకాంగ్‌లో ఏజెంట్‌గా ఉండి అమ్మించేవాడు. దాంతో 22.7కోట్ల విలువైన ఆభరణాలను కూడా నెహాల్‌ద్వారానే అమ్మడానికి నీరవ్‌ ప్రయత్నించాడు. తమ్ముడని నమ్మిఇస్తే నెహాల్‌ మాత్రం ఈ ఆభరణాన్ని విక్రయించకుండా ఇడికి అందించాడు. దీంతో నీరవ్‌మోడీ ఖంగు తిన్నాడు. నెహాల్‌ కూడా గతంలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో50కేజిల బంగారు ఆభరణా లను తీసుకుని పారిపోయిన నేరస్తుడిగా ఇడి కోర్టుకు తెలియచేసింది. అప్పుడు శత్రువుగా ఉన్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఇప్పుడు మిత్రుడిగా మారాడు నెహాల్‌. ఇదిలా ఉండగా, నీరవ్‌మోడీని భారత్‌ రప్పించేందుకు ఇతర దేశాల అధికారులతో ఇడి అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. =====