ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన

నీలం సాహ్ని

neelam sahani
neelam sahani

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇంఛార్జ్‌ సీఎస్‌గా నీరబ్‌కుమార్‌ నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సతీనాయర్‌, మిన్నీ మాథ్యూ ప్రభుత్వ మహిళా ప్రధాన కార్యదర్శులుగా బాధ్యతలు నిర్వర్తించారు. కాగా నీలం సాహ్ని గతంలో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ కార్యదర్శిగా వ్యవహిరించారు. ఇంకా నీలం సాహ్ని 1984 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన అధికారిణి గతంలో నీలం సాహ్ని కృష్ణాజిల్లా అసిస్టెంట్‌ కలెక్టర్‌గా, నల్లగొండ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించి, అనంతరం కేంద్ర సర్వీసులకు వెళ్లి గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శిగా, ఆ తర్వాత ఏపీఐడీసీ వీసీ అండ్‌ ఎండీగా ఉన్నారు. అనంతరం స్త్రీ శిశు సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు.
తాజా జాతీయ వార్తలకోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/