క్రికెట్‌లో ముందు ఒత్తిడిని జయించాలి

virat kohli
virat kohli


ముంబై: మా జట్టుపై నమ్మకం ఉందని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సారథి విరాట్‌ కోహ్లి అన్నాడు. ఇంకా ఆడాల్సిన మ్యాచుల్లో విజయాలు సాధిస్తే ప్లేఆఫ్‌కు చేరుకునే అవకాశాలున్నాయని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఒత్తిడి నుంచి బయటపడి తిరిగి పుంజుకుంటామని అన్నాడు. సోమవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. దీంతో బెంగళూరు ఏడో పరాజయాన్ని చవిచూసింది. క్రికెట్‌లో మొదటగా ఒత్తిడిని జయించాలని, అప్పుడే విజయాలు సొంతమవుతాయని అన్నాడు. గత రెండు మ్యాచుల్లోనూ మేము అదే సూత్రాన్ని పాటించామన్నాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తన తర్వాత మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌తో తలపడనుంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/