బిజెపికి దీటైన ప్రత్యామ్నాయాం అవసరం

అది భారత్ లోనే రూపుదిద్దుకోవాల్సిన అవసరం ఉంది

Sharad Pawar
Sharad Pawar

నాగ్‌పూర్‌: పౌరసత్వ సవరణ చట్టంపై(సీఏఏ) దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత,కేంద్ర మాజీ మంత్రి శరద్ పవర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ .. బిజెపి ప్రభుత్వం పట్ల రోజురోజుకీ తీవ్ర వ్యతిరేకత పెరుగుతోందని, ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న సమయంలో దేశంలో ఉండి అందరినీ ఏకతాటిపై నడిపించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. బిజెపికి దీటైన ప్రత్యామ్నాయాన్ని రూపొందించాల్సి అవసరం ఉందన్నారు. ఈ వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. సీఏఏకు వ్యతిరేకంగా దేశంలో కాంగ్రెతో సహా అన్ని పార్టీలు ఆందోళనలు చేస్తున్న సమయంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విదేశాల్లో పర్యటించడాన్ని ఈ విధంగా శరద్ పవర్ తప్పుపట్టారని విశ్లేషకులు ఊహించుకుంటున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/