2020లో 25 లక్షలు పెరగనున్న నిరుద్యోగులు

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 కోట్ల మందికి సరైన ఉద్యోగాల్లేవని ఐఎల్‌ఓ వెల్లడి

un employees
un employees

ఐక్యరాజ్య సమితి: ప్రస్తుత ఏడాదిలో ప్రపంచ నిరుద్యోగులు మరో 25 లక్షల మేర పెరగనున్నారని ఐక్యరాజ్య సమితి (యూఎన్‌) అంచనా. అంతేకాదు, ప్రపంచవ్యాప్తం గా దాదాపు 50 కోట్ల మందికి సరైన ఉద్యోగాల్లేవని యూఎన్‌కు చెందిన అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) నివేదిక వెల్లడించింది. లక్షలాది మంది సామాన్యులకు ప్రస్తు తం చేస్తున్న పనితో జీవితాన్ని మెరుగుపర్చుకోవడం కష్టమవుతోందని ఐఎల్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ గయ్‌ రైడర్‌ అన్నారు. కార్మికులు మెరుగైన పనిని, జీవితాన్ని వెతుక్కోవడానికి పని సంబంధిత అసమానతలు, తొలగింపులు ప్రధాన అడ్డంకిగా మారాయన్నారు. ది వరల్డ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అండ్‌ సోషల్‌ ఔట్‌లుక్‌: ట్రెండ్స్‌ 2020గ పేరుతో ఐఎల్‌ఓ నివేదిక విడుదల చేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/