సిఎం కాన్వాయ్‌ లో కోటి 80 లక్షలు పట్టివేత!

Arunachal CM , Pema Khandu
Arunachal CM , Pema Khandu

న్యూఢిల్లీ: ఎన్నికల సందర్భంగా మంగళవారం అర్థరాత్రి జరిపిన తనిఖిల్లో అరుణాచల్‌ ప్రదేశ్‌ సిఎం పెమాఖండ్‌ కాన్వాయ్‌ నుండి రూ.1.8 కోట్లు పట్టుబడ్డాయి. అయితే దీంతో ఈశాన్యంలో బిజెపి ఓట్లకు నోట్లు పంచుతున్నదంటూ కాంగ్రెస్ ఆరోపించింది. సీఎం పెమాఖండు, డిప్యూటీ సీఎం చౌనా మేతోపాటు ప్రధాని నరేంద్రనరేంద్రమోడిపైనా కూడా కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా డిమాండ్ చేశారు. పసిఘాట్‌లో అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. బుధవారం ఉదయమే అక్కడ ప్రధాని మోదీ ఎన్నికల ర్యాలీ నిర్వహించడం విశేషం. దీంతో ఈశాన్య ఓటర్లను డబ్బు ఆశ చూపించి బీజేపీ వలలో వేసుకుంటున్నదని సూర్జేవాలా ఆరోపించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులను వెంటనే పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం అధికారులు, పోలీసుల సమక్షంలో ముఖ్యమంత్రి కాన్వాయ్ నుంచి డబ్బు రికవరీ చేస్తున్న రెండు వీడియోలను సూర్జేవాలా మీడియాకు చూపించారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు తమకు లభించాయని ఆయన చెప్పారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/